విభజనతో ఏపీ నష్టపోయింది : చంద్రబాబు 15 h ago
AP: ఏపీని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఏడాదిలోనే అసెంబ్లీ భవనాన్ని నిర్మించామని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ హామీలు అమలు చేశామని అన్నారు. విభేదాలు లేకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. వైసీపీ నేతలు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి, ఇష్టానుసారంగా అప్పులు చేసి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏపీని గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు.